సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో తన బ్యాటింగ్ మెరుపులతో దినేశ్ కార్తిక్ మరోసారి హీరో అయ్యాడు. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరిగినప్పటికి.. అంతకముందు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను నిలబెట్టిన కార్తిక్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా' నిలిచాడు. అయితే మ్యాచ్ మిడ్ ఇన్నింగ్స్‌లో కార్తిక్ ఇంటర్య్వూ సమయంలో దేనినో చూసి బయపడినట్లు కనిపించింది. కార్తిక్ భయపడడం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా ఇన్నింగ్స్‌లో తన ప్రదర్శనపై అడిగిన ప్రశ్నకు కార్తిక్ సమాధానం ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా పైకి చూసిన కార్తిఇక్ ఏదో వస్తుందన్న తరహాలో భయానక రియాక్షన్ ఇచ్చాడు. కాసేపటికే తేరుకొని.. ''సారీ అక్కడి నుంచి వచ్చిన బంతి నావైపు దూసుకొచ్చినట్లుగా అనిపించింది.' అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో టి20లో టీమిండియా సౌతాఫ్రికాపై 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. దినేశ్ కార్తిక్(27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి అర్థసెంచరీ సాధించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆవేశ్ ఖాన్(4 వికెట్లు), చహల్(2 వికెట్లు) దెబ్బకు 7 పరుగులకే కుప్పకూలింది.
— Guess Karo (@KuchNahiUkhada) June 17, 2022
చదవండి: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి
Rishabh Pant: రోజురోజుకు మరింత బలంగా.. పంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment