T20 World Cup 2022: Jasprit Bumrah Hard Training Video - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: నెట్స్‌లో చెమటోడుస్తున్న బుమ్రా.. కష్టపడితేనే ఫలితం! వీడియో వైరల్‌!

Published Wed, Sep 14 2022 2:33 PM | Last Updated on Wed, Sep 14 2022 3:32 PM

T20 World Cup 2022: Jasprit Bumrah Trains Hard Video Goes Viral - Sakshi

PC: Jasprit Bumrah Instagram

T20 World Cup 2022- Jasprit Bumrah: టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌, ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. కాగా నిలకడైన ఆట తీరుతో మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కీలక బౌలర్‌గా ఎదిగిన బుమ్రా.. గాయం కారణంగా ఆసియా కప్‌-2022కు దూరమైన విషయం తెలిసిందే.

ఈ మెగా ఈవెంట్‌లో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. బుమ్రా లేకపోవడంతో.. సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు యువ ఫాస్ట్‌బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌ ఆసియా కప్‌ టోర్నీలో ఆడారు. 

కానీ.. చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలు మూటగట్టుకున్నారు ఈ యువ బౌలర్లు. ముఖ్యంగా సూపర్‌-4 దశలో మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో ఓటమికి బౌలర్ల వైఫల్యమే కారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో జట్టులో బుమ్రా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇక టోర్నీ నుంచి సూపర్‌-4 దశలోనే నిష్క్రమించిన టీమిండియా ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీపై దృష్టి సారించింది. అంతకంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20, దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో బుమ్రాతో పాటు మరో పేసర్‌ హర్షల్‌ పటేల్‌ కూడా జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం బుమ్రా తన ప్రాక్టీసు వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

ఇందుకు.. ‘‘శ్రమిస్తేనే నీకు కావాల్సింది దొరుకుతుంది. కష్టపడితేనే నువ్వు అనుకున్నది సాధించగలవు’’ అంటూ స్ఫూర్తిదాయక క్యాప్షన్‌ జతచేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 
చదవండి: Ind Vs Aus: భారత్‌తో సిరీస్‌.. ఆసీస్‌కు భారీ షాక్‌! ముగ్గురు స్టార్‌ ప్లేయర్లు అవుట్‌!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement