ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ అభిమానులకు అసలుసిసలు క్రికెట్ మజాను అందిస్తుంది. టోర్నీ ప్రారంభమైన రెండు రోజుల్లో రెండు సంచలనాలు నమోదయ్యాయి. ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకివ్వగా.. ఇవాళ మరో పసికూన స్కాట్లాండ్.. టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి సంచలన విజయం నమోదు చేసింది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల పరిస్థితి ఇలా ఉంటే.. వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌ల పరిస్థితి మరో రేంజ్‌లో ఉంది.
వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 17) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. ఆఖరి ఓవర్‌లో షమీ మ్యాజిక్ చేసి 3 వికెట్లు పడగొట్టి కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆసీస్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
@surya_14kumar - Maarne ka mood hi nahi ho raha yaar
— Aditya Kukalyekar (@adikukalyekar) October 17, 2022
Got out very next ball #AUSvIND #T20WorldCup #T20WorldCup2022 pic.twitter.com/TWBM2zSAtA
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆసీస్ ఆది నుంచి చెలరేగినప్పటికీ.. ఆఖరి ఓవర్‌లో షమీ వారి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది.
ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్.. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌తో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. సూర్యకుమార్.. అక్షర్‌తో మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేయగానే అక్షర్‌తో మాట్లాడతూ.. ఇవాళ భారీ షాట్లు మూడ్ లేదని అన్నాడు. అన్న ప్రకారమే ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment