ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు డెవాన్ కాన్వే రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. చేతివేలి గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి కాన్వే దూరమయ్యాడు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో గాయపడ్డ కాన్వే.. తన చేతి వేలికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ కివీ స్టార్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్యాష్‌రీచ్ లీగ్‌కు డెవాన్ దూరమయ్యాడు.
ఈ క్రమంలో కాన్వే స్ధానాన్ని భర్తీ చేసే పనిలో సీఎస్‌కే ఫ్రాంచైజీ పడింది. అతడి స్ధానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌తో భర్తీ చేయాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 మినీ ఆక్షన్‌లో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంకు వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
కానీ ఇప్పుడు వాన్‌డెర్ డస్సెన్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుడంతో సీఎస్‌కే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లహోర్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ప్రోటీస్ స్టార్ దుమ్ములేపుతున్నాడు.
ఇప్పటివరకు ఈ లీగ్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డస్సెన్.. 364 పరుగులతో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20లో కూడా డస్సెన్ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే డస్సెన్‌పై సీఎస్‌కే కన్నేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వాన్ డెర్ డస్సెన్ గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment