వన్డే ప్రపంచకప్-2023లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ప్రోటీస్ విజయంలో రాస్సీ వాన్ డెర్ డస్సెన్(76 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు ఓపెనర్ క్వింటన్ డికాక్(41), ఆండిలే ఫెహ్లుక్వాయో( 39 నాటౌట్) పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.
అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(91 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలర్లలో పేసర్ గెరాల్డ్ కోయెట్జీ 4 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్, ఎంగిడి తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమితో అఫ్గానిస్తాన్ వరల్డ్‌కప్ నుంచి ఇంటిముఖం పట్టింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో నవంబర్ 12న కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
చదవండి: మాథ్యూస్ ఒక్క బంతినైనా ఆడాల్సింది.. అలా చేసి ఉంటే: దినేష్ కార్తీక్
Comments
Please login to add a commentAdd a comment