జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మద్య జరిగిన మూడో టీ20లో అంపైర్ అల్లావుదీన్ పాలేకర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్లియర్‌గా ఔటైనప్పటికి అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం అందరని షాక్‌కు గురిచేసింది.
ఏమి జరిగిందంటే?
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. ఈ క్రమంలో మిల్లర్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతికి వెళ్లింది. వెంటనే కీపర్‌తో పాటు బౌలర్ జడేజా గట్టిగా అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ అల్లావుదీన్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు.
అంపైర్ నిర్ణయం పట్ల జడ్డూతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిప్లేలో సృష్టంగా బంతి బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. అయితే జడేజా వేసిన ఓవర్‌లో సాంకేతిక లోపం వల్ల డీఆర్‌ఎస్ అందుబాటులో లేదు.
దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి మిల్లర్ తప్పించుకున్నాడు. ఒక వేళ్ల డీఆర్‌ఎస్ అందుబాటులో ఉండి ఉంటే మిల్లర్ పెవిలియన్‌కు వెళ్లక తప్పేది కాదు. యాదృచ్ఛికంగా జడ్డు వేసిన ఓవర్ తర్వాత డీఆర్‌ఎస్ అందుబాటులో రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అంపైర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదేమి అంపైరింగ్‌రా బాబు.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ENG vs WI: ఇంగ్లండ్‌కు ఏమైంది..? విండీస్ చేతిలో మరో ఘోర పరభావం
— Cricket Videos (@cricketvid123) December 14, 2023
Comments
Please login to add a commentAdd a comment