
( ఫైల్ ఫోటో )
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు గుడ్‌న్యూస్. వెన్ను నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు కేప్‌టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్టు జట్టు సెలెక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
జడ్డూ సెకెండ్ టెస్టు కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. జట్టు కండీషనింగ్ కోచ్ రజనీకాంత్ పర్యవేక్షణంలో దాదాపు 20 నిమిషాల పాటు ముకేశ్ కుమార్‌తో కలిసి బౌలింగ్ కూడా చేశాడు. తొలి టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా భారత ఆటగాళ్లతో కలిసి రవీంద్ర జడేజా మైదానంలో కూడా కన్పించాడు.
జడ్డూ జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు యువ పేసర్ అవేష్ ఖాన్‌ను రెండో టెస్టు కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ప్రస్తుతం భారత-ఎ జట్టు తరపున ఆడుతున్న అవేష్.. ఇప్పుడు సీనియర్ జట్టుతో కలవనున్నాడు. ఇక జవనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది.
చదవండి: IND vs SA: భారత్‌తో రెండో టెస్టు.. కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్! కెప్టెన్‌గా బరిలోకి
Comments
Please login to add a commentAdd a comment