టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు.
అతడితో పాటు డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 28 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేశాడు. ప్రోటీస్ బ్యాటర్లలో వీరిద్దరి మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
కెప్టెన్ మార్‌క్రమ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మార్‌క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, రషీద్ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment