
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినా ఆయన కెప్టెన్సీని అందరు ప్రశంసిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ధోని నైపుణ్యాలను గుర్తు చేస్తు ప్రశంసలు కురిపించాడు. ఓ మీడియా చానెల్‌లో మిల్లర్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై చెప్పినప్పటికి ఐపీఎల్ 2020లో ఆయన మెరుపులను ధోని అభిమానులు, క్రికెట్‌ను ఇష్టపడే వారు చూడవచ్చని తెలిపారు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికి ధోనియే బెస్ట్ ఫినిషర్ అని పేర్కొన్నాడు. గ్రౌండ్‌లో ఆయన ప్రదర్శించే నైపుణ్యాలు క్రికెటర్లందరికి ఆదర్శమన్నాడు. ఎటువంటి పరిస్థితినైనా తన అధీనంలోకి తెచ్చుకోవడం ఆయనకే సాధ్యమని అన్నారు.
ఎంత ఒత్తిడి ఉన్న ప్రశాంతంగా ఎదుర్కొనే తీరు ధోనిని దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేర్చిందని అన్నాడు. ఒత్తిడి సందర్భాల్లో ఆయన ప్రదర్శించే నైపుణ్యాలు తనకు చాలా ఇష్టమని తెలిపాడు. మిల్లర్‌కు ధోని ఆటతీరు, వ్యక్తిత్వం అంటే విపరీతమైన ఇష్టం. గత ఐపీఎల్‌లో మిల్లర్ కింగ్స్ లెవన్ పంజాబ్ తరపున ఆడాడు. ప్రస్తుత ఐపీఎల్2020లో డేవిడ్ మిల్లర్ రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలో దిగనున్నాడు. అయితే సౌతాఫ్రికా ఆటగాగు డేవిడ్ మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా గుర్తుంపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. (చదవండి: ‘ఆ ఫాస్ట్ బౌలర్‌పైనే ధోని ఆశలు’)
Comments
Please login to add a commentAdd a comment