టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 గ్రూఫ్-2లో గురువారం పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 33 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్ వద్ద మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 20 నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 14 ఓవర్లకు కుదించి 142 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు.
అయితే 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికా ఒత్తిడిలో మరోసారి చిత్తైంది. క్లాసెన్ 15, ట్రిస్టన్ స్టబ్స్ 18 పరుగులతో కాసేపు పోరాడినప్పటికి రన్‌రేట్ పెరగడం.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో ఏ దశలో లక్ష్యం దిశగా సాగలేకపోయింది. చివరకు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అయితే టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ప్రొటిస్‌ను గెలిపించిన కిల్లర్ మిల్లర్ గాయంతో పాక్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో వచ్చిన క్లాసెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక మిల్లర్ మ్యాచ్ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. సౌతాఫ్రికా గెలుస్తుందో లేదో తెలియదు కానీ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా మిల్లర్‌కు ఉందని పేర్కొన్నారు. అతను జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ విజయంతో పాకిస్తాన్ తన సెమీస్ ఆశలను నిలుపుకుంది. అయితే జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడిపోవాలి అదే సమయంలో బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తేనే పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది.
చదవండి: Pak Vs SA: పరిగెత్తడంలో బద్దకం; రెండుసార్లు తప్పించుకొని చివరకు
Comments
Please login to add a commentAdd a comment