స్వదేశంలో సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ మహిళా జట్టుకు చుక్కెదురైంది. ముల్తాన్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
తజ్మిన్ బ్రిట్స్ (56 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. సూన్ లస్ 27, క్లో ట్రైయాన్ 15 నాటౌట్, మారిజన్ కాప్ 14. లారా వోల్వార్డ్ట్ 11 పరుగులు చేశారు. పాక్ బౌలరల్లో సదియా ఇక్బాల్ 3, నిదా దార్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమికి బీజాన్ని వేసుకుంది. అలియా రియాజ్ (52 నాటౌట్), కెప్టెన్ ఫాతిమా సనా (37 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడినప్పటికీ పాక్‌కు ఓటమి తప్పలేదు.
ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో మారిజన్ కాప్, తుమి సెఖూఖునే తలో 2, శేషని నాయుడు ఓ వికెట్ పడగొట్టి పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ బ్యాటర్లలో గుల్ ఫెరోజా 0, మునీబా అలీ 6, సిద్రా అమీన్ 4, నిదా దార్ 16, సదాఫ్ షమాస్ 2 పరుగులు చేసి ఔటయ్యారు.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. తొలి టీ20లో గెలుపుతో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. రెండో టీ20 సెప్టెంబర్ 18న ముల్తాన్ వేదికగా జరుగనుంది.
చదవండి: ‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’
Comments
Please login to add a commentAdd a comment