T20 WC 2022: Team India Super-12 Matches, Full Schedule-Details - Sakshi
Sakshi News home page

T20 WC 2022: సూపర్‌-12 మ్యాచ్‌లు.. టీమిండియా పూర్తి షెడ్యూల్‌, వివరాలు

Published Fri, Oct 21 2022 7:32 PM | Last Updated on Tue, Oct 25 2022 5:30 PM

T20 WC 2022: Team India Super-12 Matches Full Schedule-Detalis - Sakshi

టి20 ప్రపంచకప్‌లో ఒక అంకం ముగిసింది. ఇవాళ్లితో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్‌-12 మ్యాచ్‌లు ప్రారంభం కానుండడంతో అసలు మజా మొదలవనుంది. క్వాలిఫయింగ్‌ పోరులో రెండు గ్రూఫ్‌ల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-12లో అడుగుపెట్టాయి. గ్రూఫ్‌-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్‌.. గ్రూఫ్‌-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌లు అర్హత సాధించాయి. 

గ్రూఫ్‌-ఏలో టాపర్‌గా నిలిచిన శ్రీలంక ఏ-1గా, గ్రూఫ్‌-బిలో రెండో స్థానంలో ఉన్న ఐర్లాండ్‌.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా ఉన్న గ్రూఫ్‌-1లోకి వెళ్లగా.. టీమిండియా, పాకిస్తాన్‌ ఉన్న గ్రూఫ్‌-2లోకి బి1గా జింబాబ్వే, ఏ2గా నెదర్లాండ్స్‌ వచ్చాయి. 

సూపర్‌-12 స్టేజీ:
గ్రూఫ్‌-1: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్తాన్‌ శ్రీలంక, ఐర్లాండ్‌
గ్రూఫ్‌-2: ఇండియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ జింబాబ్వే, నెదర్లాండ్స్‌

ఇక గ్రూఫ్‌-2లో ఉన్న టీమిండియా ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. ఇక సూపర్‌-12లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. అక్టోబర్‌ 23న ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇక సూపర్‌-12లో టీమిండియా తమ చివరి మ్యాచ్‌ను నవంబర్‌ 6న జింబాబ్వేతో ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్‌, పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దాం.

అక్టోబర్ 23 : ఇండియా - పాకిస్తాన్.. వేదిక : మెల్‌బోర్న్,  భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 నుంచి
అక్టోబర్ 27 : ఇండియా - నెదర్లాండ్స్..  వేదిక : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, మధ్యాహ్నం 1.30 నుంచి 
అక్టోబర్ 30 : ఇండియా - సౌతాఫ్రికా.. వేదిక : పెర్త్ స్టేడియం, సాయంత్రం 4.30 నుంచి 
నవంబర్ 02 : ఇండియా - బంగ్లాదేశ్.. వేదిక : అడిలైడ్ ఓవల్మ, మధ్యాహ్నం 1:30 నుంచి 
నవంబర్ 06 : ఇండియా - జింబాబ్వే.. వేదిక : మెల్‌బోర్న్, మధ్యాహ్నం 1.30 నుంచి

ఇక సూపర్ - 12లో భాగంగా రెండు గ్రూపుల నుంచి టాప్ 2 గా నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి.  నవంబర్ 9న తొలి సెమీస్ (సిడ్నీ), నవంబర్ 10న రెండో సెమీస్ (అడిలైడ్) జరుగనుండగా.. నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఫైనల్ జరుగుతుంది. 

చదవండి: జింబాబ్వే కొత్త చరిత్ర.. 15 ఏళ్లలో తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement