matches schedule
-
Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..ఆర్చరీ..– పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్):ప్రవీణ్ జాధవ్ × వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి).పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్..– పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్):స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్..– పురుషుల వ్యక్తిగత ఫైనల్స్:గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్..– మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్:నిఖత్ జరీన్ × యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్..– పురుషుల డింగీ తొలి రెండు రేసులు:విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి).– మహిళల డింగీ తొలి రెండు రేసులు:నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీ..భారత్ × బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్..– పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్:(మధ్యాహ్నం గం. 12:00 నుంచి).– పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్:సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి × చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి).మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
అసలు సమరం మొదలు.. ఎవరితో ఎవరు?
టి20 ప్రపంచకప్‌లో 12 జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముందే అర్హత సాధించిన 8 జట్లతో పాటు క్వాలిఫయింగ్ దశ నుంచి 4 జట్లు కలిసి వరల్డ్‌కప్ టైటిల్ కోసం తలపడతాయి. నేటినుంచి జరిగే ప్రధాన దశ పోటీల్లో మరో 33 మ్యాచ్‌లు అభిమానులకు వినోదం పంచనున్నాయి. సిడ్నీలో జరిగే మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 12:30 నుంచి జరుగుతుంది. ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ సాయంత్రం గం. 4:30 నుంచి ప్రారంభ మవుతుంది. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తారు. టి20 ప్రపంచకప్ ‘సూపర్12’ షెడ్యూల్: అక్టోబర్ 22 : ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్.. సిడ్నీ ఇంగ్లండ్ వర్సెస్ అఫ్గానిస్తాన్... పెర్త్ అక్టోబర్ 23: భారత్ పాకిస్తాన్.. మెల్బోర్న్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్.. హోబర్ట్ అక్టోబర్ 24: బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్.. హోబర్ట్ దక్షిణాఫ్రికా వర్సెస్ జింబాబ్వే.. హోబర్ట్ అక్టోబర్ 25: ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక.. పెర్త్ అక్టోబర్ 26: ఇంగ్లండ్ వర్సెస్ ఐర్లాండ్.. మెల్బోర్న్ న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గానిస్తాన్.. మెల్బోర్న్ అక్టోబర్ 27: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్.. సిడ్నీ దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్.. సిడ్నీ పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే.. పెర్త్ అక్టోబర్ 28: అఫ్గానిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్.. మెల్బోర్న్ ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా.. మెల్బోర్న్ అక్టోబర్ 29: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక.. సిడ్నీ అక్టోబర్ 30: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా.. పెర్త్ బంగ్లాదేశ్ వర్సెస్ జింబాబ్వే.. బ్రిస్బేన్ పాకిస్తాన్ గీ నెదర్లాండ్స్.. పెర్త్ అక్టోబర్ 31: ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్.. బ్రిస్బేన్ నవంబర్ 1: అఫ్గానిస్తాన్ వర్సెస్ శ్రీలంక.. బ్రిస్బేన్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్.. బ్రిస్బేన్ నవంబర్ 2: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ అడిలైడ్ జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్ అడిలైడ్ నవంబర్ 3: పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా సిడ్నీ నవంబర్ 4: న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్ అడిలైడ్ ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గానిస్తాన్ అడిలైడ్ నవంబర్ 5: ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక సిడ్నీ నవంబర్ 6: భారత్ వర్సెస్ జింబాబ్వే మెల్బోర్న్ దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ అడిలైడ్ పాకిస్తాన్ వర్సెస్బంగ్లాదేశ్ అడిలైడ్ నవంబర్ 9: తొలి సెమీఫైనల్ సిడ్నీ నవంబర్ 10: రెండో సెమీఫైనల్ అడిలైడ్ నవంబర్ 13: ఫైనల్ మెల్బోర్న్ గ్రూప్–1: ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, శ్రీలంక, ఐర్లాండ్ గ్రూప్–2: భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జింబాబ్వే -
సూపర్-12 మ్యాచ్‌లు.. టీమిండియా పూర్తి షెడ్యూల్, వివరాలు
టి20 ప్రపంచకప్‌లో ఒక అంకం ముగిసింది. ఇవాళ్లితో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం కానుండడంతో అసలు మజా మొదలవనుంది. క్వాలిఫయింగ్ పోరులో రెండు గ్రూఫ్‌ల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12లో అడుగుపెట్టాయి. గ్రూఫ్-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్.. గ్రూఫ్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌లు అర్హత సాధించాయి. గ్రూఫ్-ఏలో టాపర్‌గా నిలిచిన శ్రీలంక ఏ-1గా, గ్రూఫ్-బిలో రెండో స్థానంలో ఉన్న ఐర్లాండ్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఉన్న గ్రూఫ్-1లోకి వెళ్లగా.. టీమిండియా, పాకిస్తాన్ ఉన్న గ్రూఫ్-2లోకి బి1గా జింబాబ్వే, ఏ2గా నెదర్లాండ్స్ వచ్చాయి. సూపర్-12 స్టేజీ: గ్రూఫ్-1: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ శ్రీలంక, ఐర్లాండ్ గ్రూఫ్-2: ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జింబాబ్వే, నెదర్లాండ్స్ ఇక గ్రూఫ్-2లో ఉన్న టీమిండియా ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. ఇక సూపర్-12లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. అక్టోబర్ 23న ఈ మ్యాచ్ జరగనుంది. ఇక సూపర్-12లో టీమిండియా తమ చివరి మ్యాచ్‌ను నవంబర్ 6న జింబాబ్వేతో ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్, పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దాం. అక్టోబర్ 23 : ఇండియా - పాకిస్తాన్.. వేదిక : మెల్బోర్న్, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 నుంచి అక్టోబర్ 27 : ఇండియా - నెదర్లాండ్స్.. వేదిక : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, మధ్యాహ్నం 1.30 నుంచి అక్టోబర్ 30 : ఇండియా - సౌతాఫ్రికా.. వేదిక : పెర్త్ స్టేడియం, సాయంత్రం 4.30 నుంచి నవంబర్ 02 : ఇండియా - బంగ్లాదేశ్.. వేదిక : అడిలైడ్ ఓవల్మ, మధ్యాహ్నం 1:30 నుంచి నవంబర్ 06 : ఇండియా - జింబాబ్వే.. వేదిక : మెల్బోర్న్, మధ్యాహ్నం 1.30 నుంచి ఇక సూపర్ - 12లో భాగంగా రెండు గ్రూపుల నుంచి టాప్ 2 గా నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు చేరతాయి. నవంబర్ 9న తొలి సెమీస్ (సిడ్నీ), నవంబర్ 10న రెండో సెమీస్ (అడిలైడ్) జరుగనుండగా.. నవంబర్ 13న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఫైనల్ జరుగుతుంది. చదవండి: జింబాబ్వే కొత్త చరిత్ర.. 15 ఏళ్లలో తొలిసారి -
మూడు సంవత్సరాల్లో 301 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. ఎవరితో ఎవరు?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తొలిసారి మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)ను మంగళవారం విడుదల చేసింది. మే 2022 నుంచి ఏప్రిల్ 2025 కాలానికి గానూ మహిళా క్రికెట్ జట్లు ఆడబోయే సిరీస్‌లు, మెగాటోర్నీ వివరాలను ఎఫ్టీపీలో పేర్కొంది. ఇందులో 2023 వన్డే వరల్డ్ కప్‌తో పాటు మొత్తంగా 301 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టి20లు ఉన్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే టెస్టులు ఆడనున్నాయి. ఇతర జట్లు ఎక్కువగా టి20లవైపే మొగ్గుచూపాయి. ఇక మహిళా క్రికెట్లో ఎఫ్టీపీ షెడ్యూల్ రూపొందించడం ఒక అద్భుతం ఘట్టం. ఎఫ్టీపీ అనేది కేవలం భవిష్యత్తు పర్యటనల కోసమే గాక మహిళల క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నాం. గతంలో కివీస్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పలుమార్లు హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. అందుకే ఎఫ్టీపీలో మరిన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించాం అని ఐసీసీ జనరల్ మేనేజర్ వసీమ్ ఖాన్ పేర్కొన్నారు. ఇక ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ మహిళా చాంపియన్‌షిప్(IWC)లో భాగంగా 10 జట్లు వన్డే సిరీస్‌లు ఆడనున్నాయి. దీంతో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం అన్ని జట్లకు ఉండనుంది. పాకిస్తాన్ మినహా మిగతా 9 దేశాలతో మ్యాచ్‌లు.. 2022-25 కాలానికి గాను ప్రకటించిన ఎఫ్టీపీలో టీమిండియా మహిళల జట్టు ఒక్క పాకిస్తాన్ మినహా మిగతా తొమ్మిది దేశాలతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కొన్ని ద్వైపాక్షిక, ట్రై సిరీస్‌లు ఉన్నాయి. అలాగే 2023 డిసెంబర్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఒక్కో టెస్టు మ్యాచ్ ఆడనుంది. 2022-25 కాలంలో టీమిండియా మహిళలు ఆడనున్న ద్వైపాక్షిక సిరీస్‌లు.. ►ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. ►డిసెంబర్ 2022లో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ►వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రకా, న్యూజిలాండ్‌తో ట్రై సిరీస్‌లో ఆడనున్న టీమిండియా నాలుగు టి20లు ఆడనున్నాయి ►2023 జూన్‌లో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు ►స్వదేశంలో సెప్టెంబర్-అక్టోబర్ 2023లో దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు వన్డేలు ►న్యూజిలాండ్‌తో మూడు టి20లు, మూడు వన్డేలు ►డిసెంబర్ 2023లో ఇంగ్లండ్‌తో ఒక టెస్టు, మూడు టి20లు ►డిసెంబర్ 2023లోనే ఆస్ట్రేలియాతో ఒక టెస్టు, మూడు టి20లు, మూడు వన్డేలు ►నవంబర్ 2024లో ఆసీస్‌తో ఆస్ట్రేలియా వేదికగా మూడు వన్డేలు ►డిసెంబర్ 2024లో విండీస్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు ►జనవరి 2025లో ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, మూడు టి20లు 2022-25లో జరగనున్న ఐసీసీ మెగాటోర్నీలు ►ఫిబ్రవరి 2023 - దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ►సెప్టెంబర్ / అక్టోబర్ 2024 - బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ►సెప్టెంబర్ / అక్టోబర్ 2025 - భారత్ వేదికగా మహిళల క్రికెట్ ప్రపంచకప్ UNVEILING 👀 The first-ever Women’s Future Tours Program ⬇️ — ICC (@ICC) August 16, 2022 చదవండి: IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త ZIM vs IND: నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు -
ఐపీఎల్-10 లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ: దేశవాళి క్రికెటర్లను సంపన్నులుగా మార్చే ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) పదో సీజన్ లోగోను మంగళవారం ఆవిష్కరించింది. లోగోను పది ఐపీఎల్ టోర్నమెంట్లు ప్రతిబింబించే విధంగా బ్యాట్స్‌మన్ ఆడే స్టిల్, స్పాన్సర్ కంపెనీ వివో పేరు కనిపించేటట్లు అందంగా రూపొందించింది. ఐపీఎల్ ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ బ్యాట్స్మన్లతో ఐపీఎల్ పదో సీజన్ ప్రేక్షకులను అలరించనుంది. 38 నగరాల అభిమానులు ఒకే స్టేడియంలో మ్యాచ్‌లన్ని జరుగుతున్నట్లు ఆనందించే విధంగా మల్టీ సిటీ ట్రోఫి వివో ఐపీఎల్-10 సిద్దమైంది.