శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ అర్థాంతరంగా వైదొలిగాడు.
కేప్టౌన్: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ అర్థాంతరంగా వైదొలిగాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డైవ్ కొట్టడంతో మిల్లర్ గాయపడ్డాడు. దాంతో అతని వేలికి కుట్లు పడటంతో విశ్రాంతి అనివార్యమైంది. మిల్లర్ కు సుమారు 10 రోజుల విశ్రాంతి అవసరమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది.
ప్రస్తుతం ఇరు జట్ల మధ్య జరిగే ఐదు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 2-0 ఆధిక్యంలో ఉంది. డర్బన్ లో జరిగిన రెండో వన్డేలో మిల్లర్ 98 బంతుల్లో 117 పరుగులు చేశాడు.