PC: IPL.com
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ అనుహ్యంగా ఓటమి పాలైంది. సునయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెతిలేత్తిశారు. అయితే ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, ఫినిషర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనన్నట్లు తెలుస్తోంది.
ఈ కారణంతోనే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు కూడా మిల్లర్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో తుది జట్టులోకి న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ వచ్చాడు. జట్టులోకి వచ్చిన విలియమ్సన్.. మిల్లర్ గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. "జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ డేవిడ్ మిల్లర్ సేవలు కోల్పోవడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. డేవిడ్ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడని" విలియమ్సన్ పేర్కొన్నాడు.
కాగా రెండు వారాల అంటే దాదాపు గుజరాత్ ఆడే నాలుగు మ్యాచ్‌లకు మిల్లర్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా మిల్లర్ ప్రస్తుతం గుజరాత్ జట్టులో ఫినిషర్‌గా కొనసాగుతున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.
చదవండి: #Shashank Singh: పంజాబ్ హీరో.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్?
Comments
Please login to add a commentAdd a comment