
PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది మూడో పరాజయం. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 178 పరుగులకు ఆలౌటైంది. ఇక సొంత మైదానంలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యంతో ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైమని మార్‌క్రమ్ తెలిపాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రేజేటేషన్‌లో మార్‌క్రమ్ మాట్లాడుతూ.. "బ్యాటింగ్‌లో సమిష్టగా రాణించడంలో విఫలమయ్యాం. అదే మా ఓటమిని శాసించింది. అయితే మ్యాచ్‌ను ఇంత దగ్గరగా తీసుకువెళ్లినందుకు మా బాయ్స్‌కు క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అయితే మేము ఆఖరిలో కొన్ని అదనపు పరుగులు సమర్పించుకున్నాం.
పిచ్ మ్యాచ్ మొత్తం ఒకేలా ఉంది. వికెట్ నెమ్మదిగా ఉండటంతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మేము ఎప్పుడైతే మా ఆటలో వేగం పెంచామో..దురదృష్టవశాత్తూ బంతి బ్యాట్‌పైకి రాలేదు. బౌలర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. మంచు ప్రభావం ఉంటుందనే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాం. కానీ మేము అనుకున్నది జరగలేదు. ఒక వేళ డ్యూ ప్రభావం ఉండి ఉంటే కచ్చితంగా మేము విజయం సాధించేవాళ్లం" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023 SRH vs MI: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో!