జొహన్నెస్‌బర్గ్: ఒకటి వాన ఖాతాలో... మరొకటి ఆతి థ్య ఖాతాలో పడిపోయాయి. ఇప్పుడు భారత్ ఖాతా తెరవాల్సిన సమయం వచ్చింది. దక్షిణాఫ్రికాతో ఆఖరి పోరులో టీమిండియా గెలిస్తేనే మూడు టి20ల సిరీస్‌ను 1–1తో సమం చేయగలదు. లేదంటే సిరీస్ చేజారుతుంది. ఈ నేపథ్యంలో ఆఖరి సమ రం యువ భారత్ సత్తాకు పరీక్ష పెడు తోంది. గురువారం జరిగే మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
నిజానికి గత మ్యాచ్‌లో భారత్ చేసిన స్కోరు తక్కు వేం కాదు. కానీ వాన ప్రతాపం, మంచ్ ప్రభావంతో బౌలర్లు కట్టు తప్పా రు. ఇదే అదనుగా దక్షిణాఫ్రికా బ్యాట ర్లు చెలరేగారు. ఇప్పుడు ‘సీన్’ అర్థమైన ‘సూర్య అండ్ కో’ తప్పకుండా సరైన ఎత్తుగడతోనే బరిలోకి దిగడం ఖాయం. ఇదే జరిగితే సిరీస్ చేతికి అందకపోయినా... చేజారడం మాత్రం జరగదు.
ఓపెనర్లు చెలరేగితే...
ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన ఐదు టి20ల సిరీస్‌లో టాపార్డర్ కీలకపాత్ర పోషించింది. ఇక్కడ యశస్వి–శుబ్‌మన్ గిల్ జోడి డకౌట్లతో నిరాశపరిచింది. ఇది ఇన్నింగ్స్‌పై ప్రభావం చూపించింది. పొట్టి ఫార్మాట్‌లో పవర్ ప్లే, డెత్ ఓవర్లే స్కోరును ఒక్కసారిగా మార్చేస్తాయి. భారత్ విషయంలో అదే జరిగింది. తిలక్‌వర్మ ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. మ్యాచ్ మ్యాచ్‌కు రాటుదేలుతున్న రింకూ సింగ్‌పై అందరి దృష్టి పడింది. కచ్చితత్వంతో కూడిన భారీషాట్లు అతన్ని మరో మెట్టుపై నిలబెడుతున్నాయి.
కెప్టెన్ సూర్య కుమార్ ఎలాగూ ఫామ్‌లోనే ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌పై పెద్దగా బెంగలేకపోయినా... బౌలింగ్ విభాగం తేలిపోవడమే జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవర పెడుతోంది. అనుభవజు్ఞలైన రవీంద్ర జడేజా, సిరాజ్‌లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేకపోగా...అర్ష్దీప్, ముకేశ్ విఫలమయ్యారు. కీలకమైన ఈ మ్యా చ్‌లో బౌన్సీ పిచ్ సహకారంతో భారత బౌలర్లు లైన్ అండ్ లెంత్‌కు కట్టుబడితే ఆశించిన ఫలితాల్ని అందుకోవచ్చు.
సిరీస్‌పై కన్నేసిన సఫారీ
రెండో మ్యాచ్ గెలిచి 1–0తో జోరుమీదున్న ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. ఆఖరి మ్యాచ్‌లోనూ భారత్‌ను కంగుతినిపించి 2–0తో సిరీస్‌ను వశం చేసుకోవాలనే లక్ష్యంతో మార్క్‌రమ్ సారథ్యంలోని సఫారీ బరిలోకి దిగుతోంది. రెండో మ్యాచ్‌లో ఓపెనర్ హెన్‌డ్రిక్స్, మార్క్‌రమ్ సుడిగాలి వేగం మిగతా బ్యాటర్లు కొట్టిన అడపాదడపా బౌండరీలతో కుదించిన లక్ష్యాన్ని దర్జాగా ఛేదించేలా చేసింది.
అయితే రబడా, ఇన్‌గిడిలాంటి స్పీడ్‌స్టర్లు అందుబాటులో లేని సఫారీ బౌలింగ్ కూడా పేలవంగానే కనిపిస్తోంది. ఈ విభాగాన్ని మె రుగు పర్చుకుంటేనే సిరీస్‌ను చేజిక్కించుకుంటుంది. లేదంటే యువ భారత్ సిరీస్ సమం చేసుకుంటుంది.
జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), యశస్వి, శుబ్‌మన్, తిలక్‌వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్, సిరాజ్, ముకేశ్.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్ ), హెన్‌డ్రిక్స్, బ్రీట్‌కి, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, ఫెలుక్వాయో, జాన్సెన్, కొయెట్జి, లిజాడ్ విలియమ్స్, షమ్సీ.
పిచ్–వాతావరణం
వాండరర్స్ వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. భారీ స్కోర్లు, మెరుపులకు లెక్కేలేదు. అయితే పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే పిచ్ ఇది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. గురువారం వర్ష సూచన అయితే ఉంది. కానీ మ్యాచ్ సమయానికల్లా అనుకూల వాతావరణం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment