
ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఐడెన్ మార్క్రమ్ ఇంకా జట్టుతో చేరలేదు. మార్క్రమ్ ఒక్కడే కాదు సౌతాఫ్రికాకు ఆడుతున్న ఏ ఒక్కరు కూడా ఇంకా ఐపీఎల్ ఆడేందుకు రాలేదు. ప్రస్తుతం వారంతా తమ సొంతజట్టు సౌతాఫ్రికాను వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై చేసే పనిలో ఉన్నారు.
దీంతో ఐపీఎల్ 16వ సీజన్‌కు మార్క్రమ్ వచ్చేవరకు అతని స్థానంలో భువనేశ్వర్ ఎస్‌ఆర్‌హెచ్‌ను నడిపించనున్నాడు. ఇక నెదర్లాండ్స్‌తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మూడో వన్డే రీషెడ్యూల్డ్ మ్యాచ్‌లో మార్క్రమ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 126 బంతుల్లో 17 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అతనికి డేవిడ్ మిల్లర్(61 బంతుల్లో 91 పరుగులు) సహకరించాడు. దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 33 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
ఈ సంగతి పక్కనబెడితే.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ మార్క్రమ్ సంచలన ఇన్నింగ్స్‌తో ఇరగదీస్తే.. ఐపీఎల్‌లో తన జట్టు ఎస్‌ఆర్‌హెచ్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమిని చవిచూసింది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 72 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 204 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అభిమానులు ఎస్‌ఆర్‌హెచ్‌పై ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. ''అక్కడ కెప్టెన్ ఇరగదీస్తే.. ఇక్కడ ఎస్‌ఆర్‌హెచ్ మాత్రం అదే ఆటతీరు కనబరిచింది''..'' కెప్టెన్ వస్తే గానీ ఎస్‌ఆర్‌హెచ్ రాత మారదేమో'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: చరిత్ర సృష్టించిన చహల్..