ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 135 పరుగుల టార్గెట్‌ను 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. డెవన్ కాన్వే(55 బంతుల్లో 77 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ 35 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు పడగొట్టాడు.
విజయానికి 16 పరుగుల దూరంలో సీఎస్‌కే..
సీఎస్‌కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 16 ఓవర్లు ముగిసేరికి రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 16 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. కాన్వే 65, రాయుడు 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కాన్వే ఫిఫ్టీ.. 10 ఓవర్లలో సీఎస్‌కే 86/0
135 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే ప్రస్తుతం 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. డెవన్ కాన్వే 33 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. గైక్వాడ్ 34 పరుగులతో సహకరిస్తుననాడు.
విజయం దిశగా సీఎస్‌కే.. 7 ఓవర్లలో 66/0
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం దిశగా పయనిస్తోంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. కాన్వే 42, గైక్వాడ్ 22 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 135.. సీఎస్‌కే 32/0
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. రుతురాజ్ 14, కాన్వే 17 పరుగులతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
సీఎస్‌కే టార్గెట్ 135
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో జడేజా మూడు వికెట్లతో మెరవగా.. మతీషా పతీరణా, ఆకాశ్ సింగ్, మహీష్ తీక్షణలు తలా ఒక వికెట్ తీశారు.
Photo Credit : IPL Website
16 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 106/5
16 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్లాసెన్ 11, మార్కో జాన్సెన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
95 పరుగులకే ఐదు వికెట్లు
95 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ షాట్ ఆడే ప్రయత్నంలో ధోని సూపర్ స్టంపౌట్‌తో వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 12 పరుగులు చేసిన మార్క్రమ్ తీక్షణ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
రెండో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. మంచి టచ్‌లో కనిపించిన అభిషేక్ నాయర్(36 పరుగులు) జడేజా బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 21, మార్ర్కమ్ 8 పరుగులతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
బ్రూక్(18)ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
18 పరుగులు చేసిన బ్రూక్ ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. అభిషేక్ 20, త్రిపాఠి ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
4 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 34/0
4 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. బ్రూక్ 18, అభిషేక్ శర్మ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్‌కే
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇవాళ(శుక్రవారం) చెన్నై వేదికగా 29వ మ్యాచ్‌లో సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్‌కే ఫీల్డింగ్ ఎంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/వికెట్ కీపర్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్, మతీషా పతిరానా
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్
#ThalaDhoni wins the toss and @ChennaiIPL are BOWLING FIRST at Chepauk!
Watch the #TATAIPL Southern Derby⚔️, in Tamil or Telugu, LIVE & FREE on #JioCinema#CSKvSRH #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/lvnYvDnLPm
— JioCinema (@JioCinema) April 21, 2023
వరుస విజయాలతో దూకుడు మీదున్న సీఎస్‌కేను ఎస్‌ఆర్‌హెచ్ ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హోంగ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండడంతో సీఎస్‌కే మ్యాచ్‌లో మరింత బలంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment