IPL 2023: LSG Vs SRH Match Live Updates-Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 LSG Vs SRH : ఎస్‌ఆర్‌హెచ్‌పై లక్నో ఘన విజయం

Published Fri, Apr 7 2023 7:08 PM | Last Updated on Fri, Apr 7 2023 10:54 PM

IPL 2023: LSG Vs SRH Match Live Updates-Highlights - Sakshi

ఎస్‌ఆర్‌హెచ్‌పై లక్నో ఘన విజయం
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 16 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కేఎల్‌ రాహుల్‌ 35, కృనాల్‌ పాండ్యా 34 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్లా ఫరుకీ, భువనేశ్వర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

అంతకముందు బ్యాటింగ్‌లో విఫలమైన ఎస్‌ఆర్‌హెచ్‌ లక్నో ముందు 122  పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఏ దశలోనూ కలిసిరాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.  రాహుల్‌ త్రిపాఠి 35, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ 31, అబ్దుల​ సమద్‌ 10 బంతుల్లో 21 నాటౌట్‌ రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. అమిత్‌ మిశ్రా రెండు, బిష్ణోయి, యష్‌ ఠాకూర్‌ చెరొక వికెట్‌ తీశారు.

ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా లక్నో
122 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ లక్ష్యం దిశగా సాగుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 30, కృనాల్‌ పాండ్యా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.


Photo Credit : IPL Website

విఫలమైన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు.. లక్నో టార్గెట్‌ 122
బ్యాటింగ్‌లో విఫలమైన ఎస్‌ఆర్‌హెచ్‌ లక్నో ముందు 122  పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఏ దశలోనూ కలిసిరాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.  రాహుల్‌ త్రిపాఠి 35, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ 31, అబ్దుల​ సమద్‌ 10 బంతుల్లో 21 నాటౌట్‌ రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. అమిత్‌ మిశ్రా రెండు, బిష్ణోయి, యష్‌ ఠాకూర్‌ చెరొక వికెట్‌ తీశారు.


Photo Credit : IPL Website

మెరిసిన అమిత్‌ మిశ్రా.. ఆరో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. అమిత్‌ మిశ్రా ఒకే ఓవర్లు రెండు వికెట్లు తీయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన ఆదిల్‌ రషీద్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చాడు. అంతకముందు వాషింగ్టన్‌ సుందర్‌(16) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన సుందర్‌ దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.


Photo Credit : IPL Website

14 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 76/4
14 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.  వాషింగ్టన్‌ సుందర్‌ 9 , రాహుల్‌ త్రిపాఠి 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో బ్రూక్‌ స్టంపౌట్‌గా వెనుదిరగడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.


Photo Credit : IPL Website

మార్క్రమ్‌ గోల్డెన్‌ డక్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
కృనాల్‌ పాండ్యా ఎస్‌ఆర్‌హెచ్‌ను దెబ్బతీశాడు. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్ర్కమ్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకముందు అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌(31 పరుగులు) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.


​​​​​​​Photo Credit : IPL Website

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
లక్నోతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌ అగర్వాల్‌(8 పరుగులు) కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది.


​​​​​​​​​​​​​​Photo Credit : IPL Website

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌
ఐపీఎల్ 16వ సీజ‌న్ ప‌దో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి.  టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్(వికెట్‌ కీపర్‌), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, T నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(కెప్టెన్‌), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్‌ కీపర్‌), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్

తొలి మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో చిత్తుగా ఓడిన హైద‌రాబాద్ విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్‌ రాక‌తో ఎస్ఆర్‌హెచ్ ఆత్మ‌విశ్వాసంతో ఉంది. సొంత‌గ‌డ్డ‌పై పోరులో గెలుపు సొంతం చేసుకోవాల‌ని కేఎల్ రాహుల్ సేన భావిస్తోంది. దాంతో, అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఎక‌నా స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది. మొద‌టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను ఓడించిన ల‌క్నో రెండో మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement