Aiden Markram Ties Knot With Long-Time Girlfriend Nicole - Sakshi
Sakshi News home page

Aiden Markram: పెళ్లి చేసుకున్న సన్‌రైజర్స్‌ ​కెప్టెన్‌.. అమ్మాయి ఎవరంటే?

Published Sun, Jul 23 2023 10:13 AM | Last Updated on Sun, Jul 23 2023 12:22 PM

Aiden Markram ties knot with long-time girlfriend Nicole - Sakshi

దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌  ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు నికోల్‌ను మార్క్రమ్‌ పెళ్లాడాడు. వీరిద్దరి వివాహం సెంచూరియన్‌లోని ఓ పంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. వీరిద్దరి వివాహానికి వారి స్నేహితులు, బంధువులు హజరయ్యారు. ఇందుకు సంబంధించిన  ఫోటోను  నికోల్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేసింది. కాగా వీరిద్దరూ గత 10 ఏళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

ఈ క్రమంలో గత ఏడాది వీరిద్దిరి నిశ్చితార్ధం కూడా జరిగింది. కాగా నికోల్‌ సొంతంగా ఆన్‌లైన్‌లో ఓ జ్యూవెలరీ స్టోర్‌ను నడుపుతోంది. ఇక మార్‌క్రమ్‌ ఐపీఎల్‌లో తొలిసారిగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన మార్క్రమ్.. జట్టును విజయం పథంలో నడింపించలేకపోయాడు.

ఈ ఏడాది సీజన్‌లో అతడి సారధ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. కానీ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.


చదవండి: #HarmanpreetKaur: 'డేర్‌ అండ్‌ డాషింగ్‌' హర్మన్‌ప్రీత్‌.. కుండ బద్దలయ్యేలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement