ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆసీస్ స్టార్ ప్యాట్ కమ్మిన్స్‌కు తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న ఐడైన్ మార్‌క్రమ్‌ను తప్పించేందుకు ఎస్‌ఆర్‌హెచ్ సిద్దమైనట్లు వినికిడి.
ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో ఆరెంజ్ ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా కెప్టెన్‌గా కమ్మిన్స్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా.. ఎస్‌ఆర్‌హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కమిన్స్ కెప్టెన్‌గానే కాకుండా ఫ్రంట్ లైన్ బౌలర్‌గా సన్‌రైజర్స్‌కు కీలకం కానున్నాడు.
కాగా కమ్మిన్స్ సారథ్యంలోనే వన్డే ప్రపంచకప్-2023ను, వరల్డ్‌టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌ను ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మార్‌క్రమ్ సైతం దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండు సార్లు ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం మార్‌క్రమ్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గతేడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు పగ్గాలను చేపట్టిన మార్‌క్రమ్ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‍ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment