
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రెండో సెమీఫైనల్‌కు సమయం అసన్నమైంది. సెకెండ్ సెమీఫైనల్లో లహోర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాకు అదిరిపోయే వార్త అందింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ప్రోటీస్ స్టార్ ఐడైన్ మార్‌క్రమ్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
మంగళవారం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో అతడు పాసైనట్లు క్రికెట్ సౌతాఫ్రికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో స్టాండిండ్ కెప్టెన్‌గా ఉన్న మార్‌క్రమ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే మైదాన్ని వీడాడు. ఈ క్రమంలో ప్రోటీస్ పగ్గాలు హెన్రిచ్ క్లాసెన్ చేపట్టాడు.
అయితే సెమీఫైనల్లో అతడు ఆడేది అనుమానంగా మారింది. అతడికి బ్యాకప్‌గా జార్జ్ లిండేను సైతం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు పాకిస్తాన్‌కు రప్పించింది. కానీ ఐడైన్ ఇప్పుడు ఫిట్‌నెస్ సాధించడంతో సౌతాఫ్రికా టీమ్ మెనెజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు జ్వరం కారణంగా దూరమైన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా, ఓపెనర్ డీజోర్జీ కూడా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ కూడా కివీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్లో టీమిండియాతో తాడోపేడో తెల్చుకోనుంది.
సౌతాఫ్రికా తుది జట్టు(అంచనా): ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడీ
న్యూజిలాండ్ తుది జట్టు(అంచనా): విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, విల్ ఓ'రూర్క్
చదవండి: శుబ్‌మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment