ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు ఆయా ప్రాంఛైజీలకు ఓ బ్యాడ్ న్యూస్. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌ల రీ షెడ్యూల్ వన్డే సిరీస్ ఆడనుండడమే దీనికి కారణం. కాగా ఈ సిరీస్‌లో తమ జట్టు స్టార్ ఆటగాళ్లను భాగం చేయాలని దక్షిణాఫ్రికా క్రికెట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే తమ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బీసీసీఐకి కూడా తెలియజేసినట్లు సమాచారం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కాంట్రాక్టు కల్గి ఉన్న కగిసో రబడ, లుంగి ఎంగిడీ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్‌రమ్, స్టాబ్స్, మార్కో జాన్సెన్, క్లాసన్ వంటి ప్రోటీస్ ఆటగాళ్లు నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్‌లో భాగమయ్యే ఛాన్స్ ఉంది.
తొలి మ్యాచ్‌కు మార్క్‌రమ్ దూరం.. కెప్టెన్‌గా భువీ
కాగా ప్రోటీస్ స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్‌రమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ నుంచే ఎస్‌ఆర్‌హెచ్ సారథిగా మార్క్‌రమ్ తన ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్2న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మార్క్‌రమ్ దూరం కావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది.
ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించే అవకాశం ఉంది. అనంతరం సన్‌రైజర్స్ రెండో మ్యాచ్‌కు మార్క్‌రామ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: IND vs AUS: ఎంత పని చేశావు భరత్.. ఈజీ క్యాచ్ డ్రాప్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment