భారత జట్ల క్లీన్‌స్వీప్ | Indian Chess Teams Blast Out Bolivia, Macedonia in Olympiad | Sakshi

భారత జట్ల క్లీన్‌స్వీప్

Published Sat, Sep 3 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

భారత జట్ల క్లీన్‌స్వీప్

భారత జట్ల క్లీన్‌స్వీప్

చెస్ ఒలింపియాడ్
బాకు (అజర్‌బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌లో పురుషుల జట్టు 4-0తో బొలివియాపై... మహిళల జట్టు 4-0తో మాసిడోనియాపై విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేశాయి. పురుషుల విభాగంలో ఆధిబన్ 52 ఎత్తుల్లో డానియల్ జోస్ జెమీపై, సేతురామన్ 30 ఎత్తుల్లో డెల్‌గాడిలోపై, మురళీ కార్తికేయన్ 40 ఎత్తుల్లో అలెజాంద్రో పరాగాపై, విదిత్ సంతోష్ గుజరాతి 27 ఎత్తుల్లో లూయిస్ అగిలార్‌పై నెగ్గారు.

మహిళల విభాగంలో పద్మిని రౌత్ 44 ఎత్తుల్లో మోనికా స్తకోవ్‌స్కాపై, తానియా సచ్‌దేవ్ 37 ఎత్తుల్లో బొజనా బెటోవిచ్‌పై, సౌమ్య స్వామినాథన్ 47 ఎత్తుల్లో డ్రాగనా నికొలోవ్‌స్కాపై,  బొడ్డ ప్రత్యూష 39 ఎత్తుల్లో సిమోనా లకిన్‌స్కాపై గెలిచారు. ప్రత్యర్థి జట్లు బలహీనంగా ఉండటంతో  హరికృష్ణ, హారిక తొలి రౌండ్‌లో బరిలోకి దిగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement