
భారత్ క్లీన్‌స్వీప్
శ్రీలంకపై మూడో వన్డేలో 95 పరుగులతో విజయం
సాక్షి, విశాఖపట్నం: కెప్టెన్ మిథాలీ రాజ్ అద్భుత ప్రదర్శనతో (109 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్స్)... శ్రీలంక మహిళలతో జరిగిన మూడో వన్డేలో భారత్ మహిళల జట్టు 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 229 పరుగులు చేసింది. 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో హర్మన్‌ప్రీత్ కౌర్ (55 బంతుల్లో 24; 2 ఫోర్లు)తో కలిసి మిథాలీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.
ఈజోడి మధ్య మూడో వికెట్‌కు 57 పరుగులు జత చేరగా... చివర్లో జులన్ గోస్వామి (40 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 44 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటయ్యింది. పూనమ్ యాదవ్ (4/13) లెగ్ స్పిన్ ధాటికి లంక బ్యాట్స్‌వుమెన్ బెంబేలెత్తారు. రణసింఘే (49 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గైక్వాడ్, రాణాలకు రెండేసి వికెట్లు దక్కాయి.