మిర్పూర్: ఫార్మాట్ మారినా పాకిస్తాన్ ఆటతీరులో మార్పు రాలేదు. కెప్టెన్‌గా ఆఫ్రిది వచ్చినా రాత మారలేదు. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్... అదే జోరులో ఏకైక టి20లోనూ పాక్‌ను చిత్తు చేసింది. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో నెగ్గింది.
పాక్‌పై టి20ల్లో బంగ్లాకు ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ముక్తార్ అహ్మద్ (30 బంతుల్లో 37; 5 ఫోర్లు; 1 సిక్స్), హరీస్ సోహైల్ (24 బంతుల్లో 30 నాటౌట్; 1 సిక్స్) రాణించారు. రహమాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 16.2 ఓవర్లలోనే మూడు వికెట్లకు 143 పరుగులు చేసి నెగ్గింది. తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు అవుటైనా... షకీబ్ అల్ హసన్ (41 బంతుల్లో 57 నాటౌట్; 9 ఫోర్లు), సబ్బీర్ రహమాన్ (32 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెలరేగి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 105 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ 28 నుంచి ప్రారంభమవుతుంది.
టి20లోనూ బంగ్లాదే విజయం
Published Sat, Apr 25 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement