సెంచరీలతో చెలరేగిన విండీస్‌ బ్యాటర్లు.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ | West Indies Beat Netherlands By 20 Runs 3-0 ODI Series Clean Sweep | Sakshi
Sakshi News home page

ICC ODI Super League: సెంచరీలతో చెలరేగిన విండీస్‌ బ్యాటర్లు.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Published Sun, Jun 5 2022 11:31 AM | Last Updated on Sun, Jun 5 2022 11:32 AM

West Indies Beat Netherlands By 20 Runs 3-0 ODI Series Clean Sweep - Sakshi

ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. శనివారం జరిగిన చివరి వన్డేలో నెదర్లాండ్స్‌పై 20 పరుగుల తేడాతో నెగ్గిన విండీస్‌ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో వెస్టిండీస్‌ ఐసీసీ పురుషుల వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో 80 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. క్లీన్‌స్వీప్‌ అయిన నెదర్లాండ్స్‌ 25 పాయింట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది.


మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. కైల్‌ మేయర్స్‌(106 బంతుల్లో 120, 8 ఫోర్లు, 7 సిక్సర్లు), షమ్రా బ్రూక్స్‌ (115 బంతుల్లో 101 నాటౌట్‌, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో మెరవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ 49.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌట్‌ అయింది. మాక్స్‌ డౌడ్‌ 89, విక్రమ్‌జిత్‌ సింగ్‌ 54, ముసా అహ్మద్‌ 42 పరుగులు చేశారు.

చదవండి: Ben Stokes Over Throw Controversy: మళ్లీ అదే స్టోక్స్‌.. 2019 వరల్డ్‌కప్‌ వివాదం గుర్తుకుతెచ్చేలా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement