
లాహోర్: శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లోను పాకిస్తాన్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి టి20 పోరులో పాక్ 36 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉమర్ అమిన్ (45; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. తర్వాత శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేయగల్గింది. షణక (54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆమిర్ 4 వికెట్లతో లంక వెన్నువిరిచాడు. అష్రఫ్‌కు 2 వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment