బెంగళూరు: దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ఓపెనర్లు లౌరా వొల్వార్ట్ (57 బంతుల్లో 61; 7 ఫోర్లు), తజీ్మన్ (38; 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (2/36), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (2/27) రాణించారు.
216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసి గెలిచింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (83 బంతుల్లో 90; 11 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 42; 2 ఫోర్లు) రాణించడంతో భారత్ 56 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment