బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ | Taijul Islam debut hat-trick seals 5-0 win | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్

Published Tue, Dec 2 2014 12:19 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ - Sakshi

బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్

ఢాకా: జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అలాగే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగే ట్రం మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/11) చరిత్ర సృష్టించడంతో బంగ్లా శిబిరం ఆనందం రెట్టింపయ్యింది. సోమవారం షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరిగిన ఐదో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే... ఇస్లాం ధాటికి 30 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్ మసకద్జా (54 బంతుల్లో 52; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ  చేశాడు.   తన ఆరో ఓవర్‌లో పన్యాంగర వికెట్ తీసిన ఇస్లాం మరుసటి ఓవర్‌లో తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసి రికార్డులకెక్కాడు. టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు (8/39) తీసిన బంగ్లా బౌలర్  రికార్డు కూడా ఇస్లాం పేరిటే ఉంది.  బంగ్లా 24.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 130 పరుగులు చేసి గెలిచింది. మహ్ముదుల్లా (55 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు) రాణించాడు. ముష్ఫికర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఇస్లాంకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement