
న్యూఢిల్లీ: కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్ సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రా ఏపీలో చంద్రబాబు కేసుతో బిజీగా ఉండటంతో అందుబాటులో లేకుండా పోయారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపిన సునీతారెడ్డి.. కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు.
పిటిషనర్ సునీత విజ్ఞప్తి మేరకు మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
చదవండి: YS Viveka Case: వివేకా హత్య కుటుంబ ఆస్తి కోసమే.. సీబీఐకి ఎంపీ అవినాష్ లేఖ
Comments
Please login to add a commentAdd a comment