
సాక్షి, కర్నూల్: వైఎస్ వివేకా హత్య కేసు విషయమై వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకాను చంపిన వారు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారని అన్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, వైఎస్ విమలమ్మ బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం, విమలమ్మ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఇంకా లిక్విడ్స్‌పైనే ఉన్నారని అన్నారు. ఈ క్రమంలోనే వివేకాను హత్య చేసిన వాళ్లు బయట తిరుగుతుంటే తప్పు చేయని అవినాష్ కుటుంబం ఎంతో బాధపడుతోంది.
ఏ తప్పు చేయని అవినాష్‌ను టార్గెట్ చేయడం సరికాదు. తప్పు చేయలేదంటున్న వాళ్లు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. వివేకా హత్యలో మా ఫ్యామిలీ వాళ్లు లేరని మొదట చెప్పిన వైఎస్ సునీత ఇప్పుడు ఎందుకు మాట మార్చిందో తెలియదు. సునీత వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. అసత్య ఆరోపణల వల్ల అవినాష్ తల్లి తల్లడిల్లిపోతోంది. అవినాష్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అవినాష్‌ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. న్యాయం జరుగుతుందున్న నమ్మకంతో అవినాష్ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: అనారోగ్యంపై విష కథనాలా?
Comments
Please login to add a commentAdd a comment