
సాక్షి,వైఎస్‌ఆర్: తనేంటో తన మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలుసని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలో వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో అవినాష్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
‘మూడేళ్లుగా తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. మా కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారు. మాపై ఎంత ద్వేషంతో మాట్లాడుతున్నారో చూడండి. వైఎస్ అవినాష్‌రెడ్డి ఎలాంటి వాడో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.
అయినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఉన్నాం. ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి. అయినా నేను ప్రజల్లోనే ఉంటా.. ప్రజల కోసం పని చేస్తా. బలిజలకు 31 ఎమ్మెల్యే 5 ఎంపీ సీట్లు ఇచ్చిన పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ. బలిజలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ మనది. గడచిన 16 నెలలుగా వర్షాలు పడకపోయినా గండికోట, చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులను నింపడం వల్లే ప్రస్తుతం రైతులకు సాగునీటికి, ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేదు.
గతంలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క హామీని విస్మరించింది. చంద్రబాబు నాయుడికి ధైర్యం సరిపోక మళ్లీ కూటమిగా వచ్చి 2014 లో ఇచ్చిన అబద్ధపు హామీలను మళ్లీ ఇస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు దిగజారిపోతున్నారు’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి.. కర్నూలు జిల్లాలో కూటమికి భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment