సాక్షి, అమరావతి: అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణపై ఎల్లో మీడియాకు అత్యుత్సాహమెందుకు అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 176 తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని చంద్రబాబు జీవో తెచ్చారని గుర్తు చేశారు.
‘‘ఇవాళ అవినాష్ రెడ్డి గురించి ఎల్లో మీడియా ఇష్టానుసారం రాస్తోంది. మనోడు ఉంటే ఒకలా .. లేకుంటే మరోలా రాయడం ఎల్లో మీడియా పని. గుండెజబ్బు వచ్చిన తల్లి కోసం ఎంపీ అవినాష్ రెడ్డి వెసులుబాటు అడిగారు. తల్లికి అనారోగ్యంగా ఉంటే అవినాష్ వెళ్లకూడదా?. పిలిచిన ప్రతిసారీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయాడా?. మీరు మోదీతో తగాదా పెట్టుకుంటే రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదు. చంద్రబాబు ఎందుకు బెయిల్ తెచ్చుకున్నారు?. చంద్రబాబు ఎన్నిసార్లైనా బెయిల్ తెచుకోవచ్చా?. ఏ రోజైనా సీబీఐ విచారణకు వెళ్లారా ?. చాలా దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని పేర్ని నాని మండిపడ్డారు.
చదవండి: యెల్లో మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా..విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా?
తల్లికి సీరియస్‌గా ఉంటే ఇష్టమొచ్చిన ప్రచారం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే కూడా తప్పేనా?. చంద్రబాబు అన్నం తిని బతికేకన్నా బెయిల్ మీద బతుకుతుంటారు. మీకు కనీసం మానవత్వం కూడా లేదు. జగన్‌ను చూస్తే వీళ్లకు కడుపు మంట. మచిలీపట్నం సభపై తప్పుడు వార్తలు రాశారు. సీఎం జగన్ ప్రసంగం వినకుండా వెళ్లిపోయారంటూ తప్పుడు రాతలు రాశారు. సీఎం జగన్ ప్రసంగం అందరూ శ్రద్దగా విన్నారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదన్న వార్తలు వేశారా ?. ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు. జనం లేకుంటే జనం అద్భుతంగా వచ్చారంటూ రాస్తారు. సీఎం జగన్ సభకు జనం వస్తే మాత్రం తప్పుడు రాతలు రాస్తారు. చంద్రబాబు కోసం ఎంతకైనా బరితెగించేందుకు ఎల్లో మీడియా రెడీ’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు.
‘‘ఏం చెప్పినా, ఏం రాసినా జనం నమ్మేస్తారని రామోజీ అనుకుంటున్నారు. చంద్రబాబుకు మేలు జరిగేందుకు జగన్ మీద విషం చిమ్ముతున్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కేంద్రం ఇచ్చిన నిధులపై ఇష్టమొచ్చిన కథనాలు రాస్తున్నారు’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment