
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అడుగడుగునా నిరసనలే వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని జనం నిలదీస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లామైదుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిలకు అక్కడి ప్రజలు షాక్ తగిలింది. దువ్వూరులో షర్మిల మాట్లాడుతుండగా జై జగన్ అంటూ ప్రజలు నినాదాలు చేశారు.
మాట్లాడేందుకు ఒకరు వేదికపైకి రావాలంటూ షర్మిల ఆహ్వానించారు. ఈ మేరకు మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ యేమిరెడ్డి చంద్రోబుల్ రెడ్డి వేదికపైకి వెళ్లారు. సీఎం జగన్ రాష్ట్రానికి ఏం చేశారో, మళ్లీ ఆయనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలంటూ షర్మిల సవాల్ విసిరారు. షర్మిల సవాల్‌కు స్పందించిన చంద్రఓబుల్ రెడ్డి.. అదిరిపోయే జవాబు ఇచ్చారు.
షర్మిల ఎదుటే సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పూసగుచ్చినట్లు వివరించారు. పాదయాత్రలో వైఎస్ జగన్ తమ సమస్యలు విని, నేను ఉన్నానని అండగా నిలిచారని తెలిపారు. ఇచ్చిన ప్రతి మాట సీఎం నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తామంతా సీఎం జగన్‌కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దీంతో అక్కడున్న ప్రజలంతా మరోసారి జై జగన్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment