సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు షాక్ తగిలింది. పెండ్లిమర్రి బెనీటమైన్స్ బాధితులు షర్మిలను నిలదీశారు. తమ వాహనాలకు రూ.6 లక్షల అద్దె చెల్లించలేదని నిలదీశారు. మహేశ్వర్‌రెడ్డి, గౌరీశంకర్‌రెడ్డి షర్మిల ప్రచారాన్ని అడ్డుకున్నారు. డబ్బులు చెల్లించాలని బాధితులు నిలదీయగా.. బెనీటమైన్స్‌కు, తనకు సంబంధం లేదని చెప్పి షర్మిల వెళ్లిపోయారు.
మరో వైపు, పీసీసీ చీఫ్ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment