
'లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం'
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...10 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు వెయ్యి గ్రూప్-2 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు.
ప్రాజెక్టుల రీ డిజైన్పై గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. అవసరమైతే సభను శుక్రవారం కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ...పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. ఈ పథకానికి ఏలాంటి ఆటంకాలు రాకుండా దశల వారీగా నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.