కాంగ్రెస్‌కు ఆ దమ్ముందా: గుత్తా | gutha sukhender reddy fired on congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఆ దమ్ముందా: గుత్తా

Published Sat, Jan 7 2017 4:02 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

కాంగ్రెస్‌కు ఆ దమ్ముందా: గుత్తా - Sakshi

కాంగ్రెస్‌కు ఆ దమ్ముందా: గుత్తా

సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానింత వరకు అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరలేదని, కండువా కూడా కప్పుకోలేదని తెలిపారు. తనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా, వారిదగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రిహార్సల్స్‌ కోసం వచ్చారా, అన్న మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలకు స్పందిస్తూ, తాను ఇంత వరకు ఎమ్మెల్యే కాకున్నా, సమావేశాల కోసం చాలాసార్లు అసెంబ్లీకి వచ్చానని తెలిపారు. పార్టీలో అధికారికంగా చేరాల్సి వస్తే రాజీనామా చేసే వెళ్తానని, అనర్హత వేటుకు ఎందుకు గురికావాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement