పోటీ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు
- ఇకపై వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపు
- అన్ని ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలలో అమలు
- ఒక తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత
- ఆషామాషీ అభ్యర్ధులకు ముకుతాడే లక్ష్యం
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో ‘నెగటివ్ మార్కుల’ విధానాన్ని అనుసరించాలని నిర్ణరుుంచింది. ఒక తప్పుడు సమాధానానికి 1/3 మార్కును కోత విధించనున్నారు. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప జీఓ నంబర్ 235ని విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో అభ్యర్ధులు కొందరు తమకు సరైన సమాధానాలు తెలియకపోరుునా బహుళ సమాధానాల్లో ఏదో ఒకదాన్ని లాటరీ పద్ధతిలో గుర్తిస్తున్నారు.
అదృష్టం కొద్దీ అవి సరైన సమాధానాలైతే లబ్ధి పొందు తున్నారు. దీనివల్ల నిజంగా కష్టపడి చదివి సరైన సమాధానాలు గుర్తించిన వారికి నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం వల్ల ఆషామాషీగా పరీక్షలకు హాజరైన వారు సైతం కష్టపడి చదివిన వారితో పాటుగా ఉద్యోగాల పోటీలో ముందు వరుసలోకి వచ్చేస్తున్నారని ఏపీపీఎస్సీ భావించింది. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాలంటే నెగటివ్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని కమిషన్ ప్రభుత్వానికి ఇంతకు ముందు నివేదిం చింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పరీక్షలకు అత్యధిక స్థారుులో అభ్యర్ధులు దరఖాస్తు చేస్తారని, వీరికి నేరుగా కాకుండా ముందుగా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి పూర్తిస్థారుులో వడపోత పోశాకే మెరుున్ పరీక్ష నిర్వహించనున్నందున నెగిటివ్ మార్కుల విధానం అమలుకు అనుమతివ్వాలని కోరింది. టెస్టును ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించే ఈ స్క్రీనింగ్ టెస్టుకు ‘నెగటివ్ మార్కుల విధానాన్ని అమలు చేసేందుకు తమకు అనుమతివ్వాలని ఏపీపీఎస్సీ కోరింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా అనేక ఇతర పోటీ పరీక్షల్లో అమలవుతున్న నెగటివ్ మార్కుల విధానం తరహాలో దీన్ని అమలు చేయాలని సంకల్పించింది. ఈ నెగిటివ్ మార్కుల విధానం వల్ల అదృష్టదేవతపై భారం వేసి ఏదో ఒకదాన్ని గుర్తించే అభ్యర్ధులకు ముకుతాడు పడుతుందని అభిప్రాయ పడింది. ఒక ప్రశ్న సమాధానం తప్పుగా గుర్తిస్తే వారికి అప్పటికే వచ్చిన మార్కులో 1/3 మార్కును కోత విధిస్తారు. ఏపీపీఎస్సీ పేర్కొన్నట్లు స్క్రీనింగ్ టెస్టులకే కాకుండా ఆబ్జెటివ్ మల్టిపుల్ చారుుస్ ఆన్సర్లతో నిర్వహించే అన్ని పరీక్షలకు నెగటివ్ మార్కుల విధానాన్ని అనుసరించాలని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గ్రూప్-2కు వర్తించేనా?
గ్రూప్ 2 నోటిఫికేషన్ గత నెలలోనే విడుదలైనందున దానికి ఈ జీఓ వర్తించే అవకాశం లేదు. ఒకవేళ గ్రూప్ 2కు కూడా అమలు చేయాలంటే ఏపీపీఎస్సీ గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌కు సవరణ నోటి ఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. రానున్న కాలంలో భర్తీ చేయబోయే గ్రూప్ 3 పోస్టులకు ఈ నెగటివ్ మార్కుల విధానం అమలు కానుంది.