పల్లె ప్రగతికి మళ్లీ నిధులు | Palle Pragathi Funds Released In Karimnagar | Sakshi
Sakshi News home page

పల్లె ప్రగతికి మళ్లీ నిధులు

Published Thu, Nov 28 2019 11:43 AM | Last Updated on Thu, Nov 28 2019 11:43 AM

Palle Pragathi Funds Released In Karimnagar - Sakshi

నల్లగొండ గ్రామపంచాయతీ భవనం

కరీంనగర్‌: పల్లె ప్రగతికి నిధుల వరద వస్తోంది. గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయడానికి మూడో విడత కింద మళ్లీ నిధులు విడుదలయ్యాయి. మొదటి, రెండో విడతలో 14వ ఆరి్థక, రాష్ట్ర ఆర్థిక సంఘాల కింద విడుదలైన నిధుల తో ప్రస్తుతం పల్లెల్లో పనులు జరుగుతుండగా.. మూడో విడుత కింద కరీంనగర్‌ జిల్లాకు రూ.10 కోట్లు వచ్చాయి. ఇందులో 14వ ఆరి్థక సంఘం కింద రూ.9.54 కోట్లు, రాష్ట్ర ఆరి్థక సంఘం ద్వారా రూ.57.7 లక్షలు మంజూరయ్యాయి.  జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 6,11,062 మంది ఉన్నారు. జనాభాప్రాతిపదికన పంచాయతీలకు నిధులు విడుదలయ్యాయి. సెపె్టంబర్, అక్టోబర్‌ రెండు నెలల్లో రెండు విడతల్లో రూ. 10 కోట్ల చొప్పున  నిధులు విడుదలయ్యాయి.

ఈ నెలలోనే మరో రూ.10 కోట్లు మంజూరు కావడంతో పంచాయతీల పాలకవర్గాల్లో నూతనోత్సహం కనిపిస్తోంది. గడిచిన రెండు నెలల్లో మంజూరైన నిధుల్లో కేంద్రం నుంచి 14వ ఆరి్థక సంఘం నుంచి రూ.6 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి మరో రూ.4 కోట్లు కలిపి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఈసారి అందుకు భిన్నంగా కేంద్ర ఆరి్థక సంఘం నుంచి రూ.9.5 కోట్లు నిధులు రాగా, రాష్ట్ర ఆరి్థక సంఘం నుంచి రూ.57.7 లక్షల నిధులు మాత్రమే మంజూరయ్యాయి. మొత్తంగా కరీంనగర్‌ జిల్లాకు మూడు నెలల్లో రూ.30 కోట్లు విడుదలయ్యాయి. త్వరలోనే ఈ నిధులను పంచాయతీ ఖాతాల్లో జమ చేయనున్నారు. వీటిని గ్రామపంచాయతీల్లో వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు.

కరీంనగర్‌ జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇన్నాళ్లు నిధులలేమితో పల్లె పాలన స్తంభించింది. పల్లె ప్రణాళిక కార్యక్రమం ద్వారా మురుగు కాలువలు శుభ్రం చేయడంతోపాటు అవసరమైన చోట కొత్తగా మట్టి రహదారులు వేశారు. గ్రామాల్లోని ఖాళీ ప్రాంతాల్లో ఉన్న పిచి్చమొక్కలను తొలగించారు. రహదారులకు ఇరువైపులా శుభ్రం చేశారు. పారిశుధ్యంపైనే దృష్టిసారిస్తూ మురుగు నిల్వలు లేకుండా చర్యలు చేపట్టారు. మురుగు ఉన్న ప్రాంతాల్లో మొరంతో చదును చేశారు. చాలా గ్రామాల్లో పెంటకుప్పలు తొలగించారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తయ్యేదశలో ఉన్నాయి. మొదటి, రెండో విడతలో 14వ, రాష్ట్ర ఆరి్థక సంఘాల కింద విడుదలైన నిధులు సరిపోకపోవడంతో కొన్ని పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి.  

పరుగులు పెట్టనున్న పనులు.. 
ప్రస్తుతం మూడో విడత కింద నిధులు మంజూరు కావడంతో పల్లెల్లో ప్రగతి పనులు పరుగెత్తనున్నాయి. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో చాలా వరకు పనులకు బీజం పడింది. అయినా చాలా గ్రామాలకు సరైన రోడ్ల వసతి, రహదారులు, డ్రైనేజీలు లేవు. ప్రస్తుతం నిధులతో రోడ్లు, డ్రైనేజీలతోపాటు నిన్నమొన్నటి వరకు నిధులు లేక ఆగిన పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. పంచాయతీల్లో గతంలో ప్రారంభించిన పనులు సగంలో ఆగిపోగా నిధులు రావడంతో మళ్లీ ప్రారంభించేందుకు సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  

ట్రాక్టర్ల కొనుగోలు..  
30 రోజుల ప్రణాళిక అనంతరం పల్లెల్లో చెప్పుదగిన మార్పు వచి్చంది. దీంతో ప్రభుత్వం పారిశుధ్య పనులు నిత్యం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్లాస్టిక్‌ నిషేధంతోపాటు, తడి పొడి చెత్తను వేరే చేసందుకు చెత్తబుట్టలు సైతం పంపిణీ చేసింది. చెత్తను డంప్‌యార్డులకు తరలించేందుకు పంచాయతీకో ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే నిధుల కొరతతో ట్రాక్టర్ల కొనుగోలుకు సర్పంచులు ముందుకు రావడంలేదు. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో ట్రాక్టర్ల కొనుగోలుకు ఆరి్థక వెసులుబాటు కలిగింది.  

నిధులు సది్వనియోగం చేసుకోవాలి 
30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను అమలు చేసేందుకు ప్రభుత్వం మూడు విడతల్లో 14వ ఆరి్థక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. పల్లెల్లో పేరుకుపోయిన పనులను ప్రణాళిక కార్యక్రమంలో ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు నిధులు దోహదపడనున్నాయి. చెత్త సేకరణకు ట్రాక్టర్ల కొనుగోలు , అభివృద్ధి పారిశుధ్య పనులకు మోక్షం కలుగనుంది. – రఘువరన్, డీపీవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement