సహకార కార్పొరేషన్లకు నిధులు మంజూరు | funds released to co-oparative corporations | Sakshi
Sakshi News home page

సహకార కార్పొరేషన్లకు నిధులు మంజూరు

Published Sat, May 9 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

funds released to co-oparative corporations

హైదరాబాద్: వివిధ బీసీ కులాల సహకార కార్పొరేషన్లు, తదితర పథకాలకు నిధులిస్తూ పరిపాలనపరమైన అనుమతులను శుక్రవారం ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ 26 జీవోలను జారీచేసింది. తెలంగాణ విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్‌కు రూ. 3.72 కోట్లు, వాల్మీకి బోయ సహకార సొసై టీలకు రూ.1.07 కోట్లు, వడ్డెర సహకార సొసైటీ ఫెడరేషన్‌కు రూ.2.32 కోట్లు, సగర(ఉప్పర) సొసైటీకి రూ. 1.32 కోట్లు,  కమ్యూనిటీ సర్వీసెస్ పథకం కింద రూ.5.75 కోట్లు, నాయీ బ్రాహ్మణ సహకార సొసైటీకి రూ.5 కోట్లు, రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద రూ.10.45 కోట్లు,రజక సహకార సొసైటీకి రూ.4.10 కోట్ల నిధులు అందాయి.

అదేవిధంగా మేదర ఆర్థిక కార్పొరేషన్‌కు రూ.1.32 కోట్లు, ప్రభుత్వ వసతి గృహాల పథకం కింద రూ.10.93 కోట్లు, బీసీ తెలంగాణ స్టడీసర్కిల్ పథకం కింద రూ.5.12 కోట్లు, కుమ్మరి శాలివాహన సహకార సొసైటీకి రూ.3.37 కోట్లు, కృష్ణబలిజ పూసల సహకార సొసైటీ ఫెడరేషన్‌కు రూ. 1.32 కోట్లు, కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఇన్సెంటివ్ పథకం కింద రూ.28.75 కోట్లు, అమ్మాయిలు, అబ్బాయిలకు కాలేజీ హాస్టళ్ల పథకం కింద రూ.27.97 కోట్లు, కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక కార్పొరేషన్‌కు రూ.18.78 లక్షలకు, ఏంజేపీటీబీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థలకు రూ. 11.21 కోట్లకు గవర్నెంట్ హాస్టల్స్ పథకం కింద రూ.1.34 కోట్లకు బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి డా. టి. రాధా మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement