
సాక్షి, హైదరాబాద్: ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మాల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉంది. రెడ్డిల ముసుగులో నాపై హత్యాయత్నం జరిగింది. రేవంత్ నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. రేవంత్, అతడి గుండాలను జైలుకు పంపుతాము’’ అని తెలిపారు.
కాగా, ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డి సభకు సంబంధించిన అంశాలను కాకుండా పదేపదే టీఆర్‌ఎస్ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రస్తావించడంపై అక్కడున్న వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మల్లారెడ్డి డౌన్ డౌన్.. మల్లారెడ్డి గో బ్యాక్..’అంటూ కుర్చీలు, రాళ్లు, చెప్పులను స్టేజీపైకి విసిరారు. ప్రసంగం మధ్యలోనే ఆపి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ వెంటపడి మరీ రాళ్లు, చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కష్టమ్మీద వారిని అడ్డుతప్పించి మల్లారెడ్డిని బయటికి తరలించారు.
ఇది కూడా చదవండి: టీఆర్‌ఎస్–బీజేపీలు అధికారం లేకుండా ఉండలేవు
Comments
Please login to add a commentAdd a comment