సాక్షి, హైదరాబాద్: తన సవాల్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వీకరించలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏవో కొన్ని పేపర్లు తీసుకొచ్చి తనపై కబ్జా ఆరోపణలు చేశారన్నారు. అబద్ధాలతో తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏవో పేపర్లు చూపించి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ‘‘నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అన్ని అనుమతులతోనే హాస్పటల్ కట్టాం. పేద ప్రజల కోసమే ఆసుపత్రి కట్టాను. ఎలాంటి అవకతవకలు జరగలేదని’’ మల్లా రెడ్డి అన్నారు.
‘‘జిరాక్స్ పేపర్లు పట్టుకొని వచ్చి రేవంత్‌రెడ్డి షో చేసాడు. పొద్దంతా అబద్ధాలు చెప్పటమే పనిగా పెట్టుకున్నాడు. నా కోడలు పేరు మీద ఉంది 5 ఎకరాలు కాదు 350 గజాలే. ఆ స్థలంలో హాస్పిటల్ కట్టాను. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నా. బట్టకాల్చి మీద వేయటమే రేవంత్ రెడ్డి పని’’ అంటూ మల్లారెడ్డి నిప్పులు చెరిగారు.
ఇవీ చదవండి:
తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ..
తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment