Corona Booster Dose Certificate On Died Person Name In Bhadradri, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Covid Booster Dose: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్​ ఇచ్చారట.. ఇంకేముంది!!

Published Thu, Feb 17 2022 11:14 AM | Last Updated on Thu, Feb 17 2022 12:52 PM

Corona Booster Dose Vaccine Message on Died Person Name in Bhadradri - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కొత్త మల్లారెడ్డి (రిటైర్డ్ హెడ్మాస్టర్) ఈనెల 11న చనిపోయారు. కానీ వైద్య శాఖ సిబ్బంది మాత్రం ఫిబ్రవరి 16, బుధవారం రోజున బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయం సెల్‌ఫోన్‌కు మెసేజ్ రాగా, వాళ్ల కుటుంబ సభ్యులు కోవిన్ యాప్‌లో సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసి చూస్తే, అందులో కూడా ఇవాళ వ్యాక్సిన్ వేసినట్టుగా ఎంట్రీ చేశారు. మల్లారెడ్డి భార్య కళావతికి కూడా ఇవాళ బూస్టర్ డోస్ వేయకున్నా, వేసినట్టుగా మెసేజ్ రావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

చదవండి: (మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి రానున్న సమ్మక్క)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement