త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: మల్లారెడ్డి | Former Minister Malla Reddy Said That He Will Meet Cm Revanth Reddy Soon | Sakshi
Sakshi News home page

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా: మల్లారెడ్డి

Published Thu, Feb 1 2024 3:04 PM | Last Updated on Thu, Feb 1 2024 3:32 PM

Former Minister Malla Reddy Said That He Will Meet Cm Revanth Reddy Soon - Sakshi

అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముందని.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముందని.. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తానన్నారాయన.

‘‘మేము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి ఎంపీగా నన్నే పోటీ చేయమన్నారని నేను టికెట్‌ను నా కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నానని మల్లారెడ్డి అన్నారు.

మరోవైపు, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు 71 ఏళ్లు వచ్చాయని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానన్న ఆయన.. రాజకీయ పరంగా తనకు ఇవే చివరి ఐదేళ్లు.. ఈ ఐదేళ్లలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానన్నారు.

ఇదీ చదవండి: Sambasiva Rao: సాంబశివరావుపై చీటింగ్‌ కేసు నమోదు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement