Minister Malla Reddy Interesting Comments on Etela Rajender and Vivek - Sakshi
Sakshi News home page

రాముడంటే కేటీఆర్‌.. చంద్రుడంటే కేసీఆర్‌.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Fri, Feb 10 2023 8:03 PM | Last Updated on Fri, Feb 10 2023 9:00 PM

Minister Malla Reddy Comments On Etela Rajender And Vivek - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసలు దొంగలను వదిలేసి.. పేదలకు విద్యా దానం చేస్తున్న తమపై ఐటీ దాడులు చేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారంలో ఆయన శాసనసభలో మాట్లాడుతూ వివేక్‌, ఈటల మీద ఐటీ దాడులు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చాయ్‌ అమ్మినట్లు పబ్లిక్‌ ప్రాపర్టీని అమ్ముతున్నారు. ఇప్పుడు సింగరేణిని కూడా అమ్ముతానంటున్నారు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.

తెలంగాణలో రామచంద్రుల పాలన నడుస్తోంది. రాముడు అంటే రామారావు. చంద్రుడు అంటే కేసీఆర్. ఒకప్పుడు రామరాజ్యం విన్నాం. ఇప్పుడు తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది. ఉద్యమ చంద్రుడు ఇవాళ సూర్యుడు అయ్యాడు. కేసీఆర్ పీఎం అవుతాడు.. కేటీఆర్ సీఎం అవుతాడు’’ అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement