![Hyderabad: Minister Malla Reddy Speech At Meme Famous Teaser Launch - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/26/Mallareddy6.jpg.webp?itok=CVtXslJV)
సాక్షి, హైదరాబాద్: ‘మేమే ఫేమస్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలోనే యువత శాతం ఎక్కువగా ఉందన్నారు. చిరిగిన జీన్స్ వేసుకొని అమ్మాయిలతో తిరిగితే యువత ఫేమస్ అవ్వలేరని, కష్టపడితే ఫేమస్ అవుతారన్నారు. యువత గాలికి తిరగడం మానేసి కష్టపడండి.. సక్సెస్ ఎవరికి ఊరికే రాదు, తాను కూడా పాలు అమ్మి కష్టపడి కేసీఆర్ దయతో మంత్రినయ్యానంటూ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే నెంబవర్ వన్ ఫేమస్ మంత్రి కేటీఆర్ అని ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన వల్లే గూగుల్, అమేజాన్ లాంటి సంస్థలు హైదరాబాద్కు వచ్చాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలు పూర్తయ్యాక తెలంగాణ యాసలో ఐదారు సినిమాలు నిర్మిస్తానని తెలిపారు. ఇటీవల పవన్ కల్యాణ్ సినిమాలో విలన్ గా నటించమని హరీశ్ శంకర్ మా ఇంటికి వచ్చాడు.. గంటపాటు బతిమిలాడినా నేను విలన్‌గా చేయనని స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment