ఖైరతాబాద్: మహిళాజర్నలిస్టులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున వి హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాక్సిలేటరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం నెక్లెస్ రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో మహిళాజర్నలిస్టులను మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సన్మానించారు.
కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా జర్నలిస్టులకు మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రులు జగదీష్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులతో కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా జర్నలిజం అంటే కత్తిమీద సాములాంటిది. అలాంటి వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా ఎల్రక్టానిక్, ప్రింట్ మీడియాలతో పాటు డిజిటల్ మీడియాలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరి, మున్సిఫల్ అడ్మిని్రస్టేషన్ అరవింద్ కుమార్, చీఫ్ విఫ్ బాల్కసుమన్, ఎమ్మెల్యే చందర్‌లతో పాటు అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సాక్షి టీవీ తరపున పద్మావతి, సుస్మిత, కావేరి, సాక్షి దినపత్రిక నుంచి కట్ట కవిత, డి.జి.భవానీ, వి.మంజుల, జి.నిర్మల, ఎస్.సరస్వతి రమలను సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment