ప్రధాని గారు నా సపోర్ట్‌ మీకే : కాజల్‌ | Kajal Agarwal expresses support for Prime Minister | Sakshi

ప్రధాని గారు నా సపోర్ట్‌ మీకే : కాజల్‌

Mar 16 2018 8:19 AM | Updated on Oct 30 2018 5:58 PM

Kajal Agarwal expresses support for Prime Minister - Sakshi

సాక్షి, సినిమా : మిస్టర్‌ ప్రైమ్‌మినిస్టర్‌ నా సపోర్ట్‌ ఎప్పుడూ మీకుంటుంది అని అన్నారు నటి కాజల్‌ అగర్వాల్‌. ఏంటీ ఈ బ్యూటీకీ రాజకీయ ఆశ పుట్టుకొచ్చిందా అనే సందేహం కలుగుతోందా? ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అన్న సామెతలా భవిష్యత్‌లో కాజల్‌అగర్వాల్‌ రాజకీయాలకు రెడీ అనవచ్చునేమో. ఆ మధ్య సినిమా శాశ్వతం కాదు, వేరే రంగంపై దృష్టి పెట్టాలని కాజల్‌ అన్న విషయం తెలిసిందే. ఆ సంగతి అటుంచితే ఇటీవల ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రధాని నటి కాజల్‌ అగర్వాల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారట. 

అందుకు తెగ ఆనందపడిపోయిన కాజల్‌ అందుకు సామాజిక మాధ్యమం ద్వారా బదులిచ్చారు. అదేంటంటే ‘ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఔన్నత్యంతో  మీరు రాసిన లేఖకు ధన్యవాదాలు. మహిళల సాధికారకత కోసం మీరు ప్రవేశ పెట్టిన భేటీ బచావో.. భేటీ పడావో, నారీశక్తి పథకాలకు నేను చాలా ఆకర్షితురాలినయ్యాను. వాటి ద్వారా సమాజంలో కచ్చితంగా మంచి మార్పు వస్తుంది. అలాంటి స్త్రీ శక్తిని పెంపొందించే విషయంలో మీకు నా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది’ అని కాజల్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ప్యారీస్‌ ప్యారీస్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో కల్యాణ్‌రామ్‌కు జంటగా నటిస్తున్న ఎంఎల్‌ఏ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతానికి ఇవి మినహా మరే చిత్రాలు లేవు. దీంతో కొత్త అవకాశాల కోసమో, లేక ప్రధాని దృష్టిని ఆకర్షించి రాజకీయాల్లోకి రావాలన్న దూరాలోచనో గానీ మొత్తం మీద ఈ విధంగా కాజల్‌ వార్తల్లో నానుతున్నారు. అయితే కాజల్‌ అగర్వాల్‌ సమాచారం మోదీ దృష్టికి వెళ్లిందో లేదో మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement